
హైదరాబాద్ మహానగరంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే వందల సంఖ్యలో కేసులు వెలుగులోకి రాగా..తాజాగా ఓ మటన్ వ్యాపారి ఇంట్లో ఏకంగా 14 మందికి రావడం సంచలనం గా మారింది.
పహాడీషరీఫ్‌లో నివాసం ఉండే ఓ మటన్ వ్యాపారి ఇంట్లోని 14 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు చెబుతున్నారు.. దీంతో.. ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్‌గా మార్చేశారు అధికారులు.. ఇక, ఆ మటన్ వ్యాపారికి జియాగూడలోని బంధువుల ద్వారా సోకినట్టుగా తెలుస్తోంది. కాగా, జియాగూడ ఏరియాలో వందకు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు .
