Site icon TeluguMirchi.com

మే 03 వరకు కూడా ఏ రైలు నడవదు..

దేశంలో కరోనా నియంత్రణ లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను మే 03 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు ప్రధాని మోడీ. దీంతో అన్ని రైళ్లు మే 03 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలియజేసారు. ముందుగా ఏప్రిల్ 14 తో లాక్ డౌన్ ముగియనున్నడం తో ఏప్రిల్ 15 నుండి మళ్లీ రైళ్లు పట్టాలెక్కనున్నాయని రైల్వే అధికారులు తెలియజేసారు. కానీ కరోనా వైరస్ కేసులు ఏమాత్రం తగ్గకగా పోగా ఇంకా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో మోడీ మే 03 వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో భారతీయ రైల్వే అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

అన్ని ప్యాసింజర్ రైళ్లు, ప్రీమియం రైళ్లు, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, కోల్‌కతా మెట్రో రైల్, కొంకణ్ రైల్వే లాంటి సేవలన్నీ 2020 మే 3 వరకు రద్దు చేస్తున్నామని భారతీయ రైల్వే ట్విట్టర్‌లో వెల్లడించింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకు ఐఆర్‌సీటీసీలో ఎలాంటి బుకింగ్స్, అడ్వాన్స్ రిజర్వేషన్స్ ఉండవని రైల్వే క్లారిటీ ఇచ్చింది.

Exit mobile version