Site icon TeluguMirchi.com

ఒడిశాలో కరోనా కలకలం రేపుతోంది..

కరోనా మహమ్మారి ఒడిశా లో ఓ రేంజ్ లో పెరిగిపోతుంది. మొదట్లో దేశమంతటా కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్నప్పటికీ ఒడిశాలో మాత్రం కరోనా ప్రభావం పెద్దగా కనిపించలేదు. కానీ గత వారం, పది రోజుల నుంచి మాత్రం పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నది.

శుక్రవారం కూడా కొత్తగా 65 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ఉదయం 9 గంటల వరకు ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 737కు చేరింది. అయితే ఈ మొత్తం కేసులలో ఇప్పటికే 166 మంది వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ముగ్గురు మృతి చెందారు. ఈ డిశ్చార్జిలు, మరణాలు పోను మిగతా 568 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖా తెలిపింది.

Exit mobile version