
ఉల్లి కొస్తుంటే కన్నీరు వస్తుంది..కానీ ఇప్పుడు కొనాలంటే కన్నీరు వస్తుంది..ఎందుకంటే ఉల్లి ధర భారీగా పెరిగింది. పది , ఇరవై కాదు ఏకంగా వందకు పెరిగింది. ప్రస్తుతం ఉల్లి అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. కానీ ఉల్లి వాడకం వంటల్లో తప్పనిసరిగా ఉండటంతో ధర ఎక్కువైనా కూడా కొనడం తప్పడం లేదంటున్నారు. మరోవైపు వర్షాలే ఉల్లి ధరలు మండిపోవడానికి కారణమంటున్నారు వ్యాపారులు.
వర్షాల కారణంగా మార్కెట్‌కు ఉల్లిపాయల రాక తగ్గిపోయిందని, క్వింటాలు ఉల్లిపాయలు రూ. 5,000 నుంచి రూ. 8,000 వరకు పలుకుతున్నాయని వ్యాపారులు చెప్తున్నారు. వర్షాలు తగ్గిన కానీ కొత్త ఉల్లి మార్కెట్ లోకి వచ్చేవరకు ఉల్లి ధర తగ్గదని వ్యాపారస్తులు అంటున్నారు. గడచిన ఏడాది ఇదే సమయంలో కిలో ఉల్లి ధర రూ.170 ఉందని, రాబోయే రోజుల్లో దాన్నీ బ్రేక్ చేస్తుందని వ్యాపారులు చెబుతున్నారు.
