
పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జనావాసాల మధ్య కూలిపోవడంతో విమానంలో ఉన్న 99మందితో సహా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ విమాన ప్రమాదంలో పాకిస్థాన్ నటి అయేజా ఖాన్ మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు చక్కర్లు కొట్టాయి.
అంతేకాదు, ఆమె భర్త కూడా ఈ ప్రమాదంలో కన్నుమూసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు అయేజా ఖండించారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. దయచేసి అసత్య వార్తలను ప్రచారం చేయొద్దని నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.
