Site icon TeluguMirchi.com

ప్రతి రోజు ఆ ప్రోగ్రాం చూడమంటున్న జనసేనాధినేత

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు తన ట్విట్టర్ ద్వారా ఓ అప్డేట్ తెలియజేసారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. వారి దిన చర్య లు చేసుకుంటూ టీవీ లు చూస్తూ టైం పాస్ చేస్తున్నారు. అయితే ప్రతి రోజూ ఆర్ట్ అఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిట్ రవిశంకర్ ధ్యానంలో అందరూ పాల్గొనాలని పవన్ పిలునిచ్చారు. గొప్ప మానవతావాది అయిన ఆర్ట్ అఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారి చొరవకు మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నాను అన్నారు.

ఈ కల్లోల సమయాన్ని ప్రతిఒక్కరు దృఢ సంకల్పంతో అధిగమించగలరని కోరుకుంటూ.. గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ గారితో కలిసి లక్షలాదిగా ధ్యానంలో పాల్గొనాలని పవన్ ట్వీట్ చేశారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7.30 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని యూ ట్యూబ్ లింక్‌ను పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

Exit mobile version