
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎక్కువగా ఉండడం తో కేంద్రం లాక్ డౌన్ ను మే 03 వరకు పొడిగిస్తూ ఇంకాస్త కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ప్రజలు సామజిక దూరం పాటించాలని , మాస్క్ తప్పనిసరి అని, ఇళ్లలో నుండి బయటకు రాకూడదని, కరోనా లక్షణాలు ఏమాత్రం అనిపించినా వైద్యులను సంప్రదించాలని కోరింది. అయితే కొంతమంది మాత్రం వీటిని ఏమాత్రం పాటించడం లేదు. గ్రామంలో సామాజిక దూరం పాటించడం లేదు, గుంపులుగా తిరుగుతున్నారన్న సమాచారంతో పోలీసులు, మెడికల్ సిబ్బంది కోవిడ్ 19పై వారికి అవగాహన కల్పించేందుకు వెళ్తే వారిపై గ్రామస్థులు దాడి చేసిన ఘటన బీహార్ లోని ఈస్ట్ చంపారాలోని హర్షిది గ్రామంలో చోటు చేసుకుంది.
మైక్‌లో వైద్యులు గ్రామస్థులకు సూచనలు చేస్తుండగా ఓ గుంపు వారిపై రాళ్లతో దాడి ప్రారంభించింది. దీంతో వైద్యులకు రక్షణగా ఉన్న పోలీసులు, మెడికల్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న కలెక్టర్ సీఆర్‌పీఎఫ్ దళాలను గ్రామానికి పంపి వారిని చెందరగొట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
