Site icon TeluguMirchi.com

మహారాష్ట్రలో పోలీసులకు భయపెడుతున్న కరోనా


భారత్‌ కరోనా వైరస్‌ మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. గత మూడురోజులుగా ప్రతిరోజు దేశవ్యాప్తంగా 6వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అయితే, మహమ్మారి విజృంభణ సమయంలోనూ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు కొవిడ్‌-19 బారినపడటం కలవరపెడుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో.

తాజాగా గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 87మంది పోలీసులు ఈ వైరస్‌ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో వైరస్‌ సోకిన పోలీసుల సంఖ్య 1758కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 18మంది మృత్యువాతపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Exit mobile version