Site icon TeluguMirchi.com

పీపీఈ కిట్లు తయారుచేసిన భారత నేవీ

నోవల్ కరోనా వైరస్ మహమ్మారి ప్రారంభ దశలో భారత దేశం కనీసం రోజుకు ఒక పీపీఈ కిట్‌ను అయినా తయారు చేసేది కాదు. భారత్ కూడా తొలుత పీపీఈలను దిగుమతి చేసుకుంది. ఆ తర్వాత దేశీయ సంస్థలు చవకగా పీపీఈలు రూపొందిస్తుండడంతో వీటినే వినియోగిస్తున్నారు.

అయినప్పటికీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరిన్ని పీపీఈలు అవసరమని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో భారత నేవీ సొంతంగా పీపీలు తయారుచేసింది. వీటికి కేంద్రం నుంచి ఆమోదం కూడా లభించింది. భారీ సంఖ్యలో ఉత్పత్తి చేయడమే ఇక తరువాయి.

నేవీ తయారుచేసిన ఈ పీపీఈలకు కేంద్రం ఆధ్వర్యంలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ (ఇన్ మాస్) సంస్థ అన్ని పరీక్షల అనంతరం అనుమతి పత్రం జారీ చేసింది.

Exit mobile version