Site icon TeluguMirchi.com

అప్పు చేసి సాయం చేస్తున్న ప్రకాష్ రాజ్ ..

తెరపై ప్రకాష్ రాజ్ విలన్ గా కనిపించిన ..తెర వెనుక మాత్రం రియల్ హీరో..తాను సంపాదించింది మొత్తం కూడా సమాజానికే ఉపయోగిస్తుంటారు. ఇప్పటికే పల్లెటూర్లను దత్తత తీసుకొని తన పెద్ద మనసు చాటుకున్న ప్రకాష్..ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలకు సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతుంది. దీంతో అన్ని దేశాలు , రాష్ట్రాలు లాక్ డౌన్ చేస్తూ కరోనా కు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇక్కడ కూడా కరోనా వైరస్ కేసులు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ కారణంగా రోజు వారి కూలి చేసుకుని బ్రతికే వారికీ ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అప్పు చేసి ప్రజలకు కలవాల్సిన నిత్యా అవసరాలను అందజేస్తున్నారు.

ఇదే విషయాన్నీ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. ‘‘నా ఆర్థిక వనరులు క్షీణిస్తున్నాయి. అయినా సరే అప్పు తీసుకొని అయినా ఈ కష్టకాలంలో నాకు సాధ్యమైనంత సాయం అందిస్తాను. భవిష్యత్‌లో మళ్లీ సంపాదించుకోగలనని నాకు తెలుసు. ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని చూపించాల్సిన విపత్కర సమయమిది. మనమంతా కలిసి కరోనాపై పోరాడదాం. జీవితాలను నిలబెడదాం’’ అని పేర్కొన్నారు.

Exit mobile version