Site icon TeluguMirchi.com

రైళ్ల జాబితా విడుదల

వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే రైళ్ల జాబితాను రైల్వే శాఖ ప్రకటించింది. మే 21 నుంచి వీటికి బుకింగ్స్‌ ప్రారంభం కానున్నాయి. మొత్తం 200 రైళ్లకు సంబంధించిన వివరాలను విడుదల చేసింది. ఇవన్నీ ప్రత్యేక రైళ్లుగానే రైల్వేశాఖ నడపనుంది.

కాగా రైల్వే స్టేషన్లలో ఉండే చిన్న దుకాణాలు, హోటళ్లు, క్యాటరింగ్ కేంద్రాలను తెరిచేందుకు రైల్వే బోర్డు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని జోనల్ రైల్వే అధికారులను రైల్వే బోర్డు ఆదేశించింది. రైల్వే స్టేషన్లలో ఉండే రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్ ప్లాజాల్లో అక్కడ కూర్చొని తినేందుకు అనుమతులు లేవని స్పష్టం చేసింది.

Exit mobile version