Site icon TeluguMirchi.com

Rashmika Mandanna Injury: రష్మిక మందన్నకు తీవ్ర గాయం.. షాక్‌లో ఫ్యాన్స్!

Rashmika Mandanna

Rashmika Mandanna Injury: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకు ఊహించని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఈ బ్యూటీ.. ఓ డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ సందర్భంగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో సినీ వర్గాలతో పాటు రష్మిక అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం రష్మిక ‘రణబాలి’, ‘మైసా’ వంటి చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాల కోసం యాక్షన్ సన్నివేశాలు, హై-ఇంటెన్సిటీ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు చేయాల్సి రావడంతో ఆమె శరీరంపై తీవ్ర ఒత్తిడి పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె హిప్ ఏరియాలో టెండన్ డిటాచ్‌మెంట్ (Tendon Detachment) అయినట్లు వైద్యులు గుర్తించినట్లు సమాచారం.

రష్మికకు అయిన గాయం తీవ్రత వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురి చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి గాయాలు అత్యంత కఠినమైన శారీరక శిక్షణ పొందే క్రీడాకారుల్లో ఎక్కువగా కనిపిస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రష్మికకు సుమారు 6 వారాల పాటు పూర్తిగా విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. టెండన్ తిరిగి సాధారణ స్థితికి వచ్చేందుకు రీహాబిలిటేషన్ ప్రక్రియ కూడా అవసరమని అన్నారట. ఇక కెరీర్ పరంగా చూస్తే.. రష్మిక ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆమె చేతిలో నాలుగు భారీ చిత్రాల షూటింగ్స్ ఉండటంతో పాటు, దాదాపు 30 ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆమె గాయం కారణంగా సినిమాల షూటింగ్స్‌తో పాటు కొన్ని వాణిజ్య ప్రకటనల చిత్రీకరణలు కూడా తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. రష్మిక త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్స్‌లో పాల్గొనాలని అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.

Exit mobile version