
రిపబ్లిక్ టీవీ చానల్ అధినేత ఆర్నాబ్ గోస్వామి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గౌరవమర్యాదలకు భంగం కలిగేలా వ్యవహరించారంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోనియా పరువుప్రతిష్ఠలకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసిన ఆర్నాబ్ గోస్వామిపై చర్యలు తీసుకోవాలంటూ రేవంత్ రెడ్డి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
కాగ రి ఆర్నాబ్ గోస్వామి తనపై, తన భార్యపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని ఆరోపణలు గుప్పించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. నేరుగా ఆయన సోనియా గాంధీని గురి పెట్టారు. ఆయనపై దాడిని కొంత మంది సమర్థిస్తూ.. మరికొంత మంది వ్యతిరేకిస్తూ.. ప్రకటనలు చేయడం… రాజకీయ రచ్చకు కారణం అవుతోంది. జర్నలిస్ట్‌గా ఆర్నాబ్ దంపతులపై దాడిని అందరూ ఖండించారు. జర్నలిస్టులపై దాడి వరకూ .. ఖండన వరకూ అన్ని పార్టీలు ఒకే బాట మీద ఉన్నాయి. అయితే.. ఆ దాడి పని కాంగ్రెస్‌దని ఆరోపణలు ప్రారంభించడంతో మొత్తం వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
