Site icon TeluguMirchi.com

సచిన్ కి అమ్మ ఇచ్చిన గిఫ్ట్


క్రికెట్ చరిత్రలో సెంచరీ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు “గాడ్ ఆఫ్ క్రికెట్” సచిన్ టెండూల్కర్ కు రోజు 47 ఏళ్ళు నిండాయి. 47వ వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో సచిన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రముఖ క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

అయితే ఈ ప్రత్యేకమైన రోజు అమ్మ ఆశీర్వాదంతో మొదలైందని సచిన్ తెలిపాడు. ‘‘అమ్మ ఆశీర్వాదంతో ఈ రోజు మొదలైంది. పుట్టినరోజు కానుకగా గణపతి బప్పా ఫొటోని అమ్మ గిఫ్ట్‌గా ఇచ్చింది. ఇది కచ్చితంగా వెల కట్టలేనిది’’ అని ట్వీట్‌ చేశాడు.

కాగ దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ఇది సంబరాలకు సమయం కాదని, భారత్‌లో కొవిడ్‌-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారి గౌరవార్థం, ఈసారి తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకుంటున్నట్టు సచిన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Exit mobile version