
క్రికెట్ గాడ్ సచిన్ శుక్రవారం తన 47వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. అయితే దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఇది సంబరాలకు సమయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్‌లో కొవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారి గౌరవార్థం, ఈసారి తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకుంటున్నట్టు సచిన్ ప్రకటించారు.
కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కలిగించేందుకు బీసీసీఐ రూపొందించిన ఓ వీడియోలో పాల్గొని, ‘టీమ్ మాస్క్ ఫోర్స్’లో చేరాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు సచిన్ . కొవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో ప్రజలందరూ తమ తమ ఇళ్లకే పరిమితమవ్వాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
