Site icon TeluguMirchi.com

Saina Nehwal : 7 ఏళ్ల బంధానికి ముగింపు – సైనా, కశ్యప్ విడాకులు!

Sainanehwal
Saina Kashyap divorce : భారత బ్యాడ్మింటన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జంటల్లో ఒకరైన సైనా నెహ్వాల్ మరియు పారుపల్లి కశ్యప్ తమ 7 సంవత్సరాల వివాహ బంధానికి ముగింపు పలికారు. 2018లో పెళ్లి జరిగిన ఈ జంట, చాలా కాలంగా ఒకరితో ఒకరు కలిసి శిక్షణ తీసుకుంటూ, ఆటలో విజయాలు సాధించారు. అయితే ఇటీవల సైనా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

“కొన్నిసార్లు జీవితం మనల్ని వేర్వేరు మార్గాల్లోకి తీసుకెళ్తుంది. సుదీర్ఘ ఆలోచనలు, చర్చల తర్వాత, నేను, పారుపల్లి కశ్యప్ విడిపోవాలని డిసైడ్ అయ్యాం. మేము శాంతి, అభివృద్ధి, స్వీయబలానికి ప్రాధాన్యం ఇచ్చాం. గత జ్ఞాపకాలకు నేను కృతజ్ఞురాలిని. భవిష్యత్తులో కూడా మీకు(కశ్యప్) మంచి జరగాలని మాత్రమే కోరుకుంటున్నాను. ఈ సమయంలో మా ప్రైవసీని గౌరవించి, అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు.” అని సైనా నెహ్వాల్ ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు.

ఈ విడాకులు ఒకరిపై మరొకరికి ఎలాంటి అసమ్మతి లేకుండా, స్నేహపూర్వకంగా జరిగాయి. వ్యక్తిగత జీవితం, ఆరోగ్య పరిరక్షణ, కెరీర్ పరంగా కొత్త దిశలో సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు భారత బ్యాడ్మింటన్‌ను ప్రపంచ వ్యాప్తంగా గర్వపడే స్థాయికి తీసుకెళ్లిన ఈ జంట విడిపోవడం అభిమానుల హృదయాలను కలచివేసింది.

Exit mobile version