
శృంగారం ద్వారా కరోనావైరస్ వ్యాప్తి చెందకపోవచ్చని అమెరికా, చైనా సైంటిస్టుల తాజా పరిశోధనలో వెల్లడైంది. పురుషుల స్పెర్మ్ లేదా వృషణాల్లో కోవిడ్-19 ఉన్నట్లు ప్రూప్స్ లేవని తేలింది. జికా, ఎబోలా.. కొత్తగా పుట్టుకొస్తున్న ఇతర వైరస్‌ల తరహాలో కరోనా కారక ‘సార్స్-కోవ్-2’ కూడా సెక్స్ ద్వారా వ్యాప్తి చెందొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో సైంటిస్టులు ఈ పరిశోధన చేశారు.
ఈ పరిశోధనలో భాగంగా 34 మంది కోవిడ్ పాజిటివ్ రోగుల వీర్య నమూనాలపై అధ్యయనం చేశారు. వీటిలో కరోనా వైరస్ కనిపించలేదు. అయితే ముద్దుతో ఈ వైరస్ వ్యాపించే ప్రమాదం వుందని చెప్పారు. మొత్తానికి వీర్యంలో మాత్రం కరోనా లేదని తేలింది ఈ పరిశోదనలో.
