
అంతర్జతీయంగా చమురు ధరలు తగ్గడంతో దేశంలోనూ ధరలు దిగొస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ బాదుడు అలాగే కొనసాగుతున్నా వంటగ్యాస్ ధరలు మాత్రం ఊరటనిచ్చాయి.
ప్రస్తుతం 14.2 కిలోల సిలిండర్ ధర దిల్లీలో రూ. 581.50కు తగ్గింది. గత ఏడాది జనవరిలో సిలిండర్ ధర రూ. 150.50 తగ్గగా.. ఇప్పుడు రూ.162.50 మేర తగ్గింది. గత మూడు నెలల్లో సబ్సిడీ లేని వంటగ్యాస్ సిలిండర్‌కు రూ. 277 వరకు తగ్గిందని ఎల్పీజీ సంస్థలు తెలిపాయి.
తాజా తగ్గింపుతో హైదరాబాద్‌లో సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ. 207 వరకు తగ్గనుంది. గత నెల రూ. 796.50గా ఉన్న సబ్సిడీయేతర సిలిండర్ ధర తాజా తగ్గింపుతో హైదరాబాద్‌లో రూ. 589.50కి చేరింది.
