
విశాఖలో డాక్టర్ సుధాకర్ అరెస్టు వ్యవహారంలో పోలీసుల అత్యుత్సాహంపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సంబంధిత పోలీసులపై కేసు నమోదుచేసి సీబీఐ విచారణచేపట్టాలని ఆదేశించింది. దీనిపై 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐకి న్యాయస్థానం నిర్దేశించింది.
డాక్టర్ సుధాకర్ .. ప్రభుత్వం పీపీఈ కిట్లు ఇవ్వడం లేదని బహిరంగంగా గళమెత్తారు. ఆగ్రహించిన ప్రభుత్వం సుధాకర్‌ను సస్పెండ్ చేసింది. ఆతర్వాత సుధాకర్ గుండుతో గుర్తుపట్టలేని విధంగా విశాఖలో రోడ్డుపై ప్రత్యక్షమయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు సుధాకర్‌ను అరెస్టు చేసే క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
