Site icon TeluguMirchi.com

తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

కరోనాతో విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణలో జరగాల్సిన వివిధ ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. జులై 6 నుంచి 9 వరకు ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు.

ఈ ఏడాది ప్రవేశ పరీక్షలన్నింటినీ ఆన్‌లైన్‌లోనే న్విహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఉన్నత విద్యామండలి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

మిగతా వివరాలు

జులై 1న పాలిసెట్‌
జులై 4న ఈసెట్‌
జులై 13న ఐసెట్‌
జులై 15న ఎడ్‌సెట్‌
జులై 1 నుంచి 3 వరకు పీజీఈసెట్‌
జులై 10న లాసెట్‌, లా పీజీసెట్‌

Exit mobile version