
తెలంగాణ రాష్ట్రంలోని న్యాయస్థానాలకు వేసవి సెలవుల్ని రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. లాక్‌డౌన్ వల్ల కోర్టుల్లో కార్యకలాపాలు స్తంభించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు, జిల్లా, ఇతర కోర్టులు, ట్రైబ్యునళ్లకు సెలవులు రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా రాష్ట్రంలో కరోనా పరీక్షలకు సంబంధించి భారత వైద్య పరిశోధన మండలి మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా మహమ్మారిని కట్టడిచేసేందుకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై కేంద్రం సంపూర్ణ విశ్వాసం వ్యక్తంచేసిందని పేర్కొన్నారు.
