Site icon TeluguMirchi.com

తెలంగాణలో పాసులు అక్కర్లేదు

తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు డీజీపీ కార్యాలయం నుంచి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర పోలీస్‌ శాఖ స్పష్టం చేసింది. తెలంగాణ నుంచి ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకకు ప్రయాణించే వారు మాత్రం తమ పేర్లను అక్కడి ప్రభుత్వాల యాప్‌లలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

తెలంగాణకు వచ్చే వాహనాలకు కూడా పాస్‌లు అడగడం లేదని తెలిపింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఎత్తివేస్తూ అంతర్‌రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతించింది. దీంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణాలకు ట్రాన్స్‌పోర్ట్ పాసులను జారీ చేయడాన్ని నిలిపివేసినట్లు తెలంగాణ పోలీసుశాఖ వెల్లడించింది.

Exit mobile version