
ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పదో తరగతికి నిర్వహించే 11 పేపర్లను 6కు కుదించింది. అంటే ఇప్పటి వరకు పదో తరగతిలో 11 పేపర్లను రాసిన విద్యార్థులు ఈ ఏడాది కేవలం 6 పేపర్లు మాత్రమే రాస్తారన్నమాట.
తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి ఒక్కో పేపర్ మాత్రమే ఉంటుంది. మరోవైపు, జూలై 10 నుంచి 15వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది. విద్యార్థుల ఆరోగ్య రక్షణకు అన్నివిధాలా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోబోతున్నట్టు వెల్లడించింది.
