Site icon TeluguMirchi.com

పులి మళ్లీ కనిపించింది

గత నాల్గు రోజులుగా హైదరాబాద్ నగర వాసులను , అధికారులను చెమటలు పట్టిస్తున్న చిరుత పులి మరోసారి కనిపించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హిమాయత్‌సాగర్‌ ఒడ్డున ఉన్న జీవీకే గార్డెన్స్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌లో చిరుతపులి నీళ్లు తాగుతుండగా వాచ్‌మెన్‌ గమనించారు.

ఈ విషయాన్ని అధికారుల చేరవేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు గార్డెన్‌లో కుక్కలను వదిలి చిరుత కోసం గాలిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో బోనుతోపాటు, సీసీ ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు.

Exit mobile version