
టిక్‌టాక్ సహా 59 చైనా యాప్స్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో ‘టిక్‌టాక్ ఇండియా’ ఓ ప్రకటన విడుదల చేసింది. వినియోగదారుల సమాచార భద్రత, గోప్యత విషయంలో భారతీయ చట్టాలకు లోబడి ఉన్నట్లు పేర్కొంది.
యాప్‌నకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందని టిక్‌టాక్ ఇండియా చీఫ్ నిఖిల్ గాంధీ తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇస్తామని చెప్పారు. చాలా మంది టిక్‌టాక్‌పై ఆధారపడి ఉపాధి పొందుతున్నారని.. టిక్‌టాక్‌ని నిషేధిస్తే వారంతా సమస్యలు ఎదుర్కొంటారని చెప్పుకొచ్చారు.
