
కరోనా మహమ్మారి ఎవర్ని వదిలిపెట్టడం లేదు..చిన్న , పెద్ద , ముసలి ఇలా అందరికి వ్యాపిస్తూ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తుంది. ప్రపంచ దేశాలను ఈ కరోనా వణికిస్తున్న నేపథ్యంలో చాల దేశాలు లాక్ డౌన్ ప్రకటించి కరోనా కట్టింది చేసేందుకు ట్రై చేస్తున్నారు.
తాజాగా టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ కమిటీలోని సిబ్బంది ఒకరికి కరోనా వచ్చినట్లు తేలింది. ప్రస్తుతం సదరు వ్యక్తి తన ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నాడని నిర్వహణ కమిటీ తెలిపారు. అతడు పనిచేసిన ప్రాంతాన్ని శానిటైజ్ చేశామని.. అతడితో కలిసి పనిచేసిన వాళ్లను క్వారంటైన్ కు తరలించినట్లు తెలిపారు.
