
బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడి, ఆపై క్రమంగా బలపడుతూ పెను తుపానుగా మారిన ఎంఫాన్ పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. దశాబ్దకాలం తర్వాత బెంగాల్ పై అత్యధిక ప్రభావం చూపిన తుపానుగా నిలిచిపోయింది.
ఎంఫాన్ ధాటికి 84 మంది మరణించగా, వారిలో 72 మంది పశ్చిమ బెంగాల్ లోనే మరణించారు. ఈ ప్రచండ తుపాను బీభత్సాన్ని చవిచూసింది బెంగాల్ గ్రామీణ ప్రాంతాలే కాదు కోల్ కతా మహానగరం కూడా గజగజలాడిపోయింది. వేల సంఖ్యలో గృహాలు నేలమట్టం అయ్యాయి. భారీగా చెట్లు విరిగిపడ్డాయి.
