Site icon TeluguMirchi.com

మరో 200 రైళ్లు రెడీ


కరోనా కట్టడి కోసం విధించిన నాలుగో విడత లాక్ డౌన్ నేటితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి దేశవ్యాప్తంగా రైళ్లు నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. సోమవారం నుంచి 200 రైళ్లు వివిధ మార్గాల్లో నడవనున్నాయి. రేపు ఈ రైళ్ల ద్వారా లక్షకు మందికి పైగా ప్రయాణించనున్నారు.

ప్రస్తుతం 30 శ్రామిక్ రైళ్లు నడుస్తుండగా, ఈ 200 రైళ్లు వాటికి అదనం. ఈ సందర్భంగా రైల్వే శాఖ ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వెల్లడించింది. కన్ఫాం, ఆర్ఏసీ టికెట్ ఉన్నవారినే రైళ్లలోకి అనుమతిస్తామని, ప్రయాణికులంతా 90 నిమిషాల ముందే రైల్వే స్టేషన్ కు చేరుకోవాలని సూచించింది

Exit mobile version