Site icon TeluguMirchi.com

ఆ ఫైల్ పై సంతకం చేసిన ట్రంప్


అమెరికాలో విదేశీ వలసలకు అడ్డుకట్ట వేస్తూ ఆదేశ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై తాజాగా ఆయన సంతకం చేశారు. దీంతో అమెరికాలోకి ప్రవేశించే విదేశీ వలసలకు అడ్డుకట్ట పడింది. ప్రస్తుతానికి 60 రోజుల పాటు వలసలపై నిషేధం ఆదేశాలు ఉంటాయని, ఆ తర్వాత పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని వైట్ హౌస్ వర్గాలు ప్రకటించాయి.

అయితే, ఉత్తర్వుల వల్ల కొద్ది మంది వలసదారులకే గ్రీన్‌కార్డుల జారీని ఆలస్యం చేస్తుందని నిపుణులు అంటున్నారు. కరోనా వైరస్ కారణంగా అమెరికా ఆర్థిక రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. చాలా మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అమెరికన్ల ఉపాధి దెబ్బతినకుండా ఉండేందుకు వలసలపై నిషేధం విధిస్తామని ట్రంప్ కొన్ని రోజుల కిందట ప్రకటించారు.

Exit mobile version