Site icon TeluguMirchi.com

తెలంగాణ లో ఈరోజు ఎన్ని కేసులు నమోదు అంటే..

తెలంగాణా రాష్ట్రంలో ఈరోజు కేవలం ఆరు కేసులు మాత్రమే నమోదు అయినట్లు మంత్రి ఈటెల తెలిపారు. ఈ ఆరు కేసులు కూడా జీహెచ్‌ఎంసీ పరిధిలోనివేనన్నారు. ఈ కేసులతో తెలంగాణలో మొట్ట పాజిటివ్ కేసులు 1,009కి చేరాయి.

మంగళవారం 42 మంది డిశ్చార్జ్‌ అవ్వగా , ఇప్పటివరకు 374మంది డిశ్చార్జ్‌ అయినట్లు ఈటల స్పష్టం చేశారు. 610 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 25మంది మృతి చెందారని చెప్పారు. ఈ నెల 21 నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు.

Exit mobile version