
టీటీడీ ఆస్తుల అమ్మకం వ్యవహారం హైకోర్టు ముంగిట చేరింది. శ్రీవారి ఆస్తుల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది బాలాజీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. టీటీడీ ఆస్తులను వేలం వేయడం చట్టవిరుద్ధమని న్యాయవాది బాలాజీ స్పష్టం చేశారు.
భవిష్యత్తులో టీటీడీ ఆస్తులు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. టీటీడీ ఆస్తుల వివరాలను అధికారిక వెబ్ సైట్ లో పెట్టాలని విన్నవించారు. వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది హైకోర్టు.
