
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున గత రెండు నెలలకుపైగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించని విషయం తెలిసిందే.
తాజాగా 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనాలకు అనుమతించే విధంగా ప్రభుత్వ అనుమతిచ్చింది. ప్రయోగాత్మక దర్శనాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మే 12న ఈవో రాసిన లేఖకు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ దర్శనాలకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.ఎస్.వి. ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
