Site icon TeluguMirchi.com

మద్యం అనుకుని రసాయనం తాగిన యువకులు

గత నెల రోజులుగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కావడం తో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాలలో తినడానికి తిండి కూడా దొరకడం లేదు. దీంతో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. వీరి సంగతి ఇలా ఉంటె మద్యం ప్రియులు మద్యం దొరకకపోవడం తో ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. మరికొంతమంది బ్లాక్ లో వేలు పెట్టి కూడా మద్యం తీసుకుంటున్నారు. తాజాగా ఓ ఇద్దరు యువకులు మద్యం అనుకోని రసాయనం తాగి మరణించిన ఘటన భువనగిరి లో చోటు చేసుకుంది.

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన షేక్‌ బాబా, రియాజ్‌ అనే ఇద్దరు యువకులు ఉంటున్నారు.. ప్లాస్టిక్‌ వస్తువులను కొనడం, విక్రయించడం వీరి జీవనోపాధి.. అయితే, మూడు రోజుల కిందట ఓ ప్లాస్టిక్‌ డ్రమ్మును కొనుగోలు చేసిన ఆ ఇద్దరు యువకులు.. ఆ డ్రమ్ము మూత తీస్తుండగా.. ఆల్కహాల్‌ వాసన వచ్చిందంట. దాంట్లో ఉన్న కెమికల్‌ను తీసి.. నీటిలో కలుపుకుని ఇద్దరు సేవించారు. దాంతో.. అస్వస్థతకు గురయ్యారు.. ఇక, కుటుంబసభ్యులు వీరిని హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు.

Exit mobile version