
ప్రపంచం కరోనా వైరస్‌తో వణికిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. అందులో 1,30,000 మందికిపైగా మృతిచెందారు. ప్రాణాంతక వైరస్‌ను కట్టడిచేయడానికి ఇప్పటికే అన్ని దేశాలు లాక్‌డౌన్ పాటిస్తుండడంతో భూమ్మీద సగం జనాభా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో రవాణా, వాణిజ్య, పారిశ్రామిక రంగాలతో పాటు ఎన్నో ఉపాధి రంగాలు మూతబడ్డాయి.
ఇలాంటి ఆన్‌లైన్‌లో తీవ్రవాదుల రిక్రూట్‌మెంట్ కొనసాగుతున్నట్లు యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు. కోవిడ్19 మహమ్మారి సమయంలో.. తీవ్రవాదం పెరిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ఉన్న అసహనం, ఆవేశాన్ని.. కొందరు దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న సంక్షోభం కన్నా ముందు నుంచే యువత అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నదని ఆయన భద్రతా మండలికి విన్నవించారు.
