
గత మూడువారాల్లో కొవిడ్-19 కేసులు నమోదవుతున్న 145 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ ప్రాంతాల్లో వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోపోతే అవి వైరస్‌కు కేంద్రస్థానాలుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ సందర్భంగా రాష్ట్రాల ప్రతినిధులతో మాట్లాడుతూ కేబినెట్ సెక్రటరీ రాజీవ్‌గౌబా పలు విషయాలు వెల్లడించారు.
వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వలస కార్మికులు తిరిగి సొంతరాష్ట్రాలకు వెళ్తుండటంతో తూర్పు భారతం ఇప్పుడు కరోనా హాట్‌స్పాట్‌గా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బిహార్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కరోనా తీవ్రత తక్కువగా ఉందని, కానీ గత మూడు వారాల నుంచి మే 25 వరకు నమోదవుతున్న కేసుల్లో వేగం పెరిగిందన్నారు.
