
విజయవాడ పటమటలో కలకలం సృష్టించిన గ్యాంగ్‌వార్‌లో ఒకరు మృతి చెందారు. అపార్ట్‌మెంట్ విషయంలో మణికంఠ, తోట సందీప్ మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో గాయపడిన సందీప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సందీప్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘర్షణలో గాయపడినవారిలో మరికొంత మంది ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సుమారు 40 మంది ఈ దాడిలో పాల్గొన్నారని.. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
