
మనుషుల్లోని కాదు జంతువులలో కూడా ప్రేమ ఉంటుందని, ఒకర్ని విడిచి మరొకరు ఉండరని ఈ వీడియో తో మరోసారి బయటపడింది. ఇటీవల ఓ రైతు తన ఆవును అమ్మేయగా దాన్ని ఓ వాహనంలో తీసుకెళ్లారు. అయితే, ఆ ఆవును వాహనంలో ఎక్కించిన వెంటనే ఎద్దు కంగారు పడిపోయింది. దాన్ని వదిలేయాలని వేడుకుంటున్నట్లు అటూ ఇటూ తిరిగింది. దీంతో వీధిలోని వారందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను తమ స్మార్ట్ ఫోన్లలో తీశారు.
అయితే, చివరకు ఆ ఆవును వాహనంలో తీసుకెళ్లిపోయారు. చాలా దూరం వరకు ఆ వాహనం వెనకాలే ఎద్దు పరుగులు తీసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది వైరల్ కావడంతో లక్షలాది మంది దీనిపై స్పందించారు.
దీంతో చివరకు వారి విజ్ఞప్తులు ఆ ఆవును కొన్న వ్యక్తుల వరకు వెళ్లాయి. దీంతో ఆ రెండింటినీ మళ్లీ కలిపి, పూజలు చేశారు. మరి మీరు కూడా ఈ వీడియో ఫై లుక్ వెయ్యండి.
True love still exists❤️❤️❤️
Touching story from India ??!
pic.twitter.com/zY5aNeFjL9— Erik Solheim (@ErikSolheim) September 10, 2020
