Site icon TeluguMirchi.com

మళ్ళీ భయపడ్డ విశాఖ వాసులు

విశాఖ లో వెలువడిన దట్టమైన పొగలు విశాఖ వాసులను మరోసారి భయభ్రాంతులకు గురిచేశాయి. మల్కాపురంలోని హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ గొట్టాల నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

విశాఖ మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో ఎన్‌హెచ్‌యూను తెరిచేందుకు సంస్థ సన్నాహాలు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో భారీ ఎత్తున తెల్లని పొగ అలుముకోవడంతో ఎన్‌ఏడీ, మర్రిపాలెం, కంచరపాలెం వాసులు భయాందోళనకు గురై ఇళ్ల నంచి ఒక్కసారిగా బయటకు వచ్చారు. అయితే నిమిషాల వ్యవధిలోనే పొగ తీవ్రత తగ్గిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Exit mobile version