Site icon TeluguMirchi.com

మద్యం షాప్స్ ఓపెన్

కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా నిత్యావసరాల షాప్స్ , మెడికల్ షాప్స్ ఇవి మాత్రమే ఓపెన్ కాగా మిగతావన్నీ మూతపడ్డాయి. ముఖ్యంగా వైన్ షాప్స్ బంద్ కావడం తో మందు బాబుల కష్టాలు అన్ని ఇన్ని కావు. మందు కు బానిసైన వారు గత కొన్ని రోజులుగా మద్యం దొరకకపోయేసరికి పిచ్చి పట్టినట్లు, మతిస్తిమితం కోల్పోయినట్లు ప్రవర్తిస్తున్నారు. మరికొన్ని చోట్ల తట్టుకోలేక ఆత్మహత్యలు, చాకులతో గొంతు కోసుకుంటున్న ఘటనలు బయటకొచ్చాయి.

తాజాగా ఈరోజు నుండి మధ్య షాప్స్ ఓపెన్ అయ్యాయి. కాకపోతే మనదగ్గర కాదు అస్సాం, మేఘాలయ రాష్ట్రాలలో ఓపెన్ చేసారు. అస్సాంలో, మద్యం షాపులు, టోకు గిడ్డంగులు, బాట్లింగ్ ప్లాంట్లు, డిస్టిలరీలు, బ్రూవరీస్ సోమవారం నుండి ప్రతిరోజూ ఏడు గంటల పాటు తెరుచుకుంటాయని ఉత్తర్వులో పేర్కొంది. పొరుగున ఉన్న మేఘాలయలో, మద్యం షాపులు మరియు గిడ్డంగులు ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటాయి. సామాజిక దూరం, చేతి పరిశుభ్రత పాటించనున్నట్లు అధికారులు తెలిపారు.

Exit mobile version