Site icon TeluguMirchi.com

కరోనా తో క్రికెటర్‌ మృతి ..

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బ కు వేల సంఖ్య లో మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇక లక్షల సంఖ్య లో హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా పాకిస్తాన్‌ మాజీ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్‌ జాఫర్‌ సర్ఫరాజ్‌ (50) కరోనా మహమ్మారికి బలయ్యాడు.

గత మంగళవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో జాఫర్‌ సర్ఫరాజ్‌కు పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ నేపథ్యంలో పెషావర్‌లోని లేడీ రీడింగ్‌ ఆసుపత్రిలో జాఫర్‌ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. శ్వాసకోస సంబంద వ్యాధితో బాధపడుతున్న జాఫర్‌ మూడు రోజుల నుంచి వెంటిలేటర్‌ మీద ఉంచామని వైద్యులు తెలిపారు.

జాఫర్‌ సర్ఫరాజ్‌ తన కెరీర్‌లో 6 వన్డేలు ఆడి 96 పరుగులు చేశాడు. జాఫర్‌ 1988 నుంచి 94 వరకు 15 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో పెషావర్‌కు ప్రాతినిధ్యం వహించి 616 పరుగులు, 1990 నుంచి 92 వరకు లిస్ట్‌ ఏ క్రికెట్‌ ఆడాడు. కాగా రిటైర్మంట్‌ అనంతరం జాఫర్‌ సీనియర్‌ జట్టుతో పాటు అండర్‌-19 జట్టుకు కోచ్‌గా పనిచేశాడు.

Exit mobile version