
The India Story OTT: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో రూటు పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన ఈ స్టార్ హీరోయిన్, ఇప్పుడు నటనకు ఆస్కారమున్న లేడీ ఓరియెంటెడ్, కంటెంట్ బేస్డ్ ప్రాజెక్ట్‌లను మాత్రమే ఎంచుకుంటోంది. కథలో తన పాత్రకు పూర్తి ప్రాధాన్యం ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఆ క్రమంలోనే ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ది ఇండియా స్టోరీ’.
కెమికల్స్ మాఫియా, దాని వెనుక దాగున్న చీకటి కోణాల చుట్టూ తిరిగే ఆసక్తికరమైన స్టోరీ లైన్‌తో డైరెక్టర్ చేతన్ డీకే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే కొద్ది రోజుల క్రితం డిజిటల్ ప్రీమియర్‌గా రిలీజ్ అయ్యింది. అయితే ఆ సమయంలో కేవలం ఇతర భాషలకే పరిమితం కావడంతో, తెలుగు వెర్షన్ కోసం కాజల్ అభిమానులు ఎదురుచూశారు. ఎట్టకేలకు తెలుగు ఆడియన్స్‌కు ఆ సస్పెన్స్ వీడింది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం ‘జియో హాట్‌స్టార్’ ఈ చిత్రాన్ని అక్టోబర్ 1 నుంచి (నేటి నుంచి) తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది. ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండా సైలెంట్‌గా తెలుగు వెర్షన్‌ను అందుబాటులోకి తేవడం గమనార్హం. కాజల్ అగర్వాల్ తన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసే ఈ సినిమాలో శ్రేయస్ తల్పడే, మురళీ శర్మ కీలక పాత్రల్లో మెప్పించారు. సాగర్ బి. షిండే నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ డార్క్ క్రైమ్ థ్రిల్లర్‌ను వీక్షించాలనుకునేవారు హాట్‌స్టార్‌లో చూసేయవచ్చు.












