
Romanchakam OTT Release: బాక్సాఫీస్ వద్ద రా అండ్ రస్టిక్ సినిమాలతో సంచలనాలను సృష్టించే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బ్యాకింగ్ ఉందంటే చాలు.. ఆ ప్రాజెక్ట్‌పై ఆడియన్స్‌లో ఆటోమేటిక్‌గా ఓ క్రేజ్ నెలకొంటుంది. అలాంటి సెన్సేషనల్ డైరెక్టర్ సమర్పణలో, ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రోమాంచకం’. ‘మేమ్ ఫేమస్’ చిత్రంతో యూత్‌ను ఆకట్టుకున్న టాలెంటెడ్ యంగ్ యాక్టర్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటించగా, అనంతిక సనీల్ కుమార్ హీరోయిన్‌గా మెప్పించింది.
దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి యూత్‌ఫుల్ లవ్, ఫన్ అండ్ ఎమోషన్స్ కలబోతగా మలిచిన ఈ చిత్రం థియేటర్లలో డీసెంట్ బజ్‌తో విడుదలై ప్రేక్షకులను అలరించింది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లను రాబట్టిన ఈ మూవీ, థియేట్రికల్ రన్ ముగియడంతో ఇప్పుడు డిజిటల్ తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది.
ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’ ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకోగా, అక్టోబర్ 1 నుంచి (నేటి నుంచే) ‘రోమాంచకం’ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో ఇతర ప్రధాన భాషల డబ్బింగ్‌తో కూడా నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను రిలీజ్ చేయడం విశేషం. థియేటర్లలో మిస్సయిన సినీ ప్రియులు, సరికొత్త లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులు ఇప్పుడు తమ ఇంట్లోనే కూర్చుని ఈ సినిమాను వీక్షించవచ్చు.














