Akhanda 2 Review

తెలుగుమిర్చి రేటింగ్ : 3.5/5
బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే మాస్ ఆడియన్స్‌కు ఒక సెలబ్రేషన్‌లా ఉంటుంది. సింహా, లెజెండ్, అఖండ ఇచ్చిన హై వల్ల ఈ జోడీపై అంచనాలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. అఖండ తాండవం — అఖండ సక్సెస్‌కి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం, రిలీజ్‌కు ముందే భారీ హైప్‌తో సొంతం చేసుకుంది. ‘బాలయ్య మరోసారి శివతాండవం చేస్తే స్క్రీన్లు కంపించకుంటాయా?’ అన్న హైలెవెల్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య విడుదలైన ఈ సినిమా, మాస్ ప్రేక్షకుల్ని ఎంతవరకు అలరించింది? బోయపాటి మ్యాజిక్ మళ్లీ పనిచేసిందా? అనేది రివ్యూ లో చూద్దాం…
అఖండ మొదటి భాగం జరిగిన తరువాత దాదాపు 17–18 సంవత్సరాల తరువాత కథ మొదలవుతుంది. అఖండ సోదరుడి కుమార్తె జనని (హర్షాలి మల్హోత్రా) DRDOలో ట్రైనీ. కుంభమేళాలో ఒక ప్రమాదకరమైన వైరస్ దాడి జరుగుతుంది. దాన్ని అరికట్టేందుకు ఆమె తన మెంటార్ (సంయుక్త మీనన్) సహాయంతో వ్యాక్సిన్ రూపొందిస్తుంది. కానీ ఈ యాంటీడోట్‌ను పొందడానికి శత్రుదేశం వెనుక ఉన్న దుష్ట శక్తులు—ఠాగూర్ (కబీర్ దుల్హన్ సింగ్), నేత్ర (ఆది పినిశెట్టి)—జననిని వెంటాడుతారు. ఈ ప్రమాదంలో ఆమెకు రక్షణగా నిలబడటానికి, శివారాధనలో నిమగ్నమైన అఖండ (బాలకృష్ణ) తిరిగి రంగంలోకి దిగుతాడు. దేశాన్ని, సనాతన ధర్మాన్ని సవాలు చేసే శత్రువులను అఖండ ఎలా ఎదుర్కొన్నాడు? నేత్ర పాత్ర వెనుక నిజం ఏమిటి? గంగలో వైరస్ కలిపింది ఎవరు? ఇవన్నీ సినిమా ప్రధాన కథ.
బోయపాటి సినిమాల్లో కథ కంటే స్టైల్, పేస్, ఎలివేషన్స్‌కి ప్రాధాన్యం ఎక్కువ. ఈ సినిమా కూడా అదే ఫార్ములాతో సాగుతుంది. మొదటి భాగం కొంచెం స్లోగా అనిపించినా అఖండ ఎంట్రీతో స్క్రీన్‌పై ఎనర్జీ రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా ప్రీ-ఇంటర్వెల్ ఫైట్ బోయపాటి స్టైల్ మాస్ హంగామాతో థియేటర్‌ను ఊపేస్తుంది. రెండో భాగంలో పేస్ ఒడుదొడుకులు ఉన్నా అఖండ ఎలివేషన్స్, డివోషనల్ టోన్, శివతత్వాన్ని చూపించే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వైరస్–వాక్సిన్ ట్రాక్ లోతుగా రాయలేదు కానీ ఆర్క్‌ను హై వోల్టేజ్ ప్రెజెంటేషన్‌తో కవర్ చేశారు. తమన్ BGM ఈ సినిమాలో మరో హీరో. అఖండ ఎంట్రీల దగ్గర ఆయన ఇచ్చిన మ్యూజిక్ థియేటర్‌లో కర్జనలు తెప్పిస్తుంది.
బాలకృష్ణ అఖండగా అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్‌తో మరోసారి తన రేంజ్ ఏమిటో చూపించారు. గెటప్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్—అన్నీ పీక్‌లో ఉన్నాయి. హర్షాలి మల్హోత్రా తన పాత్రకు కావాల్సిన అమాయకత్వాన్ని బాగా చూపించింది. ఆది పినిశెట్టి లుక్, బాడీ లాంగ్వేజ్ స్ట్రాంగ్‌గా ఉన్నా అఖండ ఇంపాక్ట్ ముందు అతనికి ఎక్కువ స్కోప్ రాలేదు. కబీర్ దుల్హన్ సింగ్ విలన్‌గా సరిగ్గా చేశాడు. సినిమాటోగ్రఫీ, సెట్స్, ప్రొడక్షన్ విల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.
మొత్తం మీద అఖండ తాండవం ఒక ప్యూర్ మాస్, డివోషనల్ ఎంటర్‌టైనర్. లాజిక్ కంటే ఎమోషన్, ఎనర్జీ, ఎలివేషన్స్ కోసం థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులను ఇది ఖచ్చితంగా మెప్పిస్తుంది. బాలయ్య ఫ్యాన్స్‌కు ఇది పండగలా ఉంటుంది. మాస్ ఆడియన్స్‌కు ఫుల్ సంతృప్తి ఇచ్చే సినిమా.
తెలుగుమిర్చి రేటింగ్ : 3.5/5









