అసలు సినిమా ముందుంది అంటున్న పవన్ ఫ్యాన్స్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు. కేవలం సినీ ప్రేక్షకులే కాదు సినీ స్టార్స్ సైతం పవన్ అంటే ప్రాణం ఇస్తారు. అందుకే పవన్ కళ్యాణ్ కు సంబందించిన ఏ చిన్న విషయమైనా హల్చల్ చేస్తుంటారు. తాజాగా పవన్ అభిమానులు ట్విట్టర్‌లో నేషనల్ లెవెల్ రికార్డును కొల్లగొట్టారు. తమ అభిమాన హీరో పవన్ పుట్టినరోజును పురస్కరించుకుని, 50 రోజులు ముందుగానే అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో సరికొత్త ట్రెండ్‌ సృష్టించారు. ఈ హ్యాష్ ట్యాగ్‌తో 24 గంటల్లో ఏకంగా 27.3 మిలియన్ల ట్వీట్స్ చేసి రికార్డు క్రియేట్ చేశారు.

ఇప్పటివరకు ఏ హీరోకు ఇంత పెద్ద మొత్తంలో బర్త్ డే ట్వీట్స్ రాలేదని సమాచారం. మరి అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే కే ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తే, బర్త్ డేని ఏ రేంజ్ లో సెలెబ్రేట్ చేయనున్నారో చూడాలి..