తీపి కబురు : థియేటర్స్ ఓపెన్ కాబోతున్నాయోచ్ ..

గత మూడు నెలలుగా మూతపడిన సినిమా థియేటర్స్ మరికొన్ని రోజులు ఓపెన్ కాబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి సినీ , రాజకీయ వర్గాలు. కరోనా వైరస్ కారణంగా మూడు నెలలుగా థియేటర్స్ మూతపడ్డాయి. కేంద్రం ఇస్తున్న సడలింపుల కారణంగా సినిమా థియేటర్స్ తప్ప మిగతావన్నీ దాదాపు ఓపెన్ అయ్యాయి. అయితే సినిమా ప్రేమికులు థియేటర్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు.

దేశ‌వ్యాప్తంగా ఆగ‌స్టు 1 నుంచి థియేట‌ర్ల‌ను షురూ చేయాల‌ని కేంద్రం భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. వ‌యోప‌రిమితి ఆధారంగా థియేట‌ర్ల‌లోకి అనుమ‌తించేందుకు మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందిస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ప్ర‌తీ రోజు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో థియేట‌ర్లు ఓపెన్ చేయాల్సి వ‌స్తే..కేసుల తీవ్ర‌త మ‌రింత అవ‌కాశాలుంటాయి. కానీ ప‌లు ప్రాంతాల్లో ప్ర‌భుత్వాలు లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేశాయి. ఈ నేప‌థ్యంలో థియేట‌ర్లు రీఓపెన్ చేయ‌డం ఎంతవ‌ర‌కు సాధ్యమ‌వుతుంద‌ని వేచి చూడాలి.