పుష్ప నుండి తప్పుకొవడానికి కారణం అదేనట..

అల వైకుంఠపురం లో చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప మూవీ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రష్మిక హీరోయిన్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ లకు అనుమతులు రావడం తో త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రం నుండి తమిళ్ హీరో విజయ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. దీనికి కారణాలు అంటూ అనేక వార్తలు ప్రచారం జరుగగా..తాజాగా తాను సినిమా నుండి తప్పుకోవడానికి అసలు కారణం ఇదే అని విజయ్ క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ తేదీలు సర్దుబాటు కాకపోవడంతో తాను ‘పుష్ప’ సినిమా నుంచి తప్పుకున్నానని చెప్పారు.

డైరెక్టర్ సుకుమార్‌ను తాను స్వయంగా కలిసి తేదీల విషయాన్ని వివరించానని విజయ్ వెల్లడించారు. తనకు ఈ సినిమాలో చేయాలని ఉన్నప్పటికీ షూటింగ్ మొదలయ్యాక తనకు తేదీలు కుదరక ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.