లోదుస్తులతో ‘ఇల్లి బేబీ’ హల్చల్

దేవదాస్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచమైన గోవా బ్యూటీ ఇలియానా..మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యం గా యూత్ అయితే అమ్మడి నడుము ఒంపులకు ఫిదా అయ్యారు. దీంతో అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తట్టడం తో అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కానీ ఆ స్థాయి ని నిలుపుకోలేపోయింది.

రీసెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ కు బై బై చెప్పి..మళ్లీ సినిమాల ఫై ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. హాటెస్ట్ ఫొటోస్ తో తెగ ఆకట్టుకుంటుంది. నిత్యం బీచ్‌‌ల వెంటే తిరిగే ఇలియానా అందాల ఆరబోతలో స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో చాలా రోజుల పాటు ఇంటికే పరిమితమైన ఈ గోవా బ్యూటీ.. మళ్లీ బీచ్‌ ఒడ్డున చేరింది. హాట్ హాట్‌ లో- దుస్తుల్లో బీచ్‌లో సేద తీరుతూ కనిపించింది ఇల్లీ బేబీ. ‘ఇన్నాళ్ల ఎదురుచూపులు ఇప్పుడు ఫలించాయి. మంచి రోజులు వచ్చాయ్.. సాధారణ స్థితికి వచ్చాను’ అంటూ ఈ సందర్భంగా ఇలియానా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.