
కరోనా వైరస్ కారణంగా గత మూడు నెలలుగా షూటింగ్ లు , సినిమా థియేటర్స్ అన్ని బంద్ కావడం తో చిత్ర సీమా కుదేల్ అవుతుంది. నిర్మాతలు భారీ నష్టాలూ వస్తున్నాయి. దీంతో నటి నటులంతా తమ రెమ్యూనరేషన్ ను తగ్గించుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే పలువురు తగ్గించుకోగా..తాజాగా తమిళ్ స్టార్ హీరో విజయ్ సైతం తన నెక్స్ట్ సినిమా రెమ్యూనరేషన్ లో 20 శాతం తగ్గించుకున్నాడట.
ఈ విషయం తెలిసి అభిమానులు , చిత్ర సీమా ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయ్ నటించిన మాస్టర్ మూవీ విడుదలకు సిద్దమైంది. థియేటర్స్ తెరుచుకున్న వెంటనే మాస్టర్ మూవీ విడుదల కానుంది. దర్శకుడు లోకేష్ కనక రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ రోల్ చేయడం విశేషం. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ సమకూర్చారు.









