
పూరీ జగన్నాద్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బద్రి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచమైన అమీషా పటేల్..మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో అమీషా నటనకు , ఆమె అందానికి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాతో ఇటు పూరీకి, అటూ అమీషాకు మంచి బ్రేకోచ్చింది. ఈ మూవీ తర్వాత అమీషా కు సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నాని సినిమాలో , జూనియర్ ఎన్టీఆర్ సరసన నరసింహుడు చిత్రంలో అలాగే బాలకృష్ణ సినిమాలో ఛాన్స్ దక్కింది. కానీ ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని చవిచూడడం తో మరో అవకాశం రాకుండా పోయింది.
బాలీవుడ్ లో పలు ఛాన్సులు వచ్చినప్పటికీ అమ్మడు మాత్రం బిజీ హీరోయిన్ కాలేకపోయింది. ప్రస్తుతం ఏజ్ మీద పడిన కానీ తన హాట్ గ్లామర్ తో సినిమా ఛాన్సుల కోడం ట్రై చేస్తూనే ఉంది. సోషల్ మీడియా ను గట్టిగా నమ్ముకున్న ఈ భామ ఎప్పటికప్పుడు అందులో తన హాట్ స్టిల్స్ ను అభిమానులతో పంచుకుంటూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఓ చిన్న వీడియోను పోస్ట్ చేసింది అమీషా . ఈ వీడియోలో ఓవర్ ఎక్స్ పోసింగ్ తో ఔరా అనిపించింది. దీనికి ఫ్యాన్స్ నుంచి ధీటుగానే స్పందన కనిపిస్తోంది. హాట్నెస్.. సూపర్ హాట్.. బ్యూటిఫుల్.. ఫిట్ అండ్ ఫ్యాబులస్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.









