
వకీల్ సాబ్ చిత్ర యూనిట్ కు షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ కు సంబందించిన కోర్ట్ సీన్ పిక్ లీక్ అయ్యింది. ‘వకీల్ సాబ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ గత కొంతకాలంగా కరోనా విజృంభణ వల్ల వాయిదా పడింది.
ఈ క్రమంలో సినిమాకు సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో నటిస్తున్న క్యాస్టింగ్ గురించి పూర్తి సమాచారం లేదు. కథ ప్రకారం ఈ మూవీలో ముగ్గురు అమ్మాయిల పాత్రలు కీలకం. అందులో ఒక పాత్రలో నివేద థామస్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి కూడా నటిస్తున్నట్లు చెపుతున్నారు. వకీల్ సాబ్ మూవీ నుండి ఓ వర్కింగ్ స్టిల్ లీక్ కాగా, అందులో పవన్ వెనుక స్టాండ్ లో కూర్చోని ఉన్న ఓ అమ్మాయి ఉంది. అస్పష్టంగా ఉన్న ఆమె ముఖం చూస్తుంటే…హీరోయిన్ అంజలి అనిపిస్తుంది. మరి దీనిపై స్పష్టత రావాలంటే కొద్దిరోజులు ఆగాలి.









